HYD: నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ వద్ద ఆదివారం నిర్వహించిన నమో యువ 3K రన్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. యువతలో డ్రగ్స్ మత్తు ప్రభావంపై అవగాహన కల్పించి, డ్రగ్స్ రహిత దేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతలో స్ఫూర్తి నింపేలా ఈ రన్ ఉత్సాహంగా సాగింది. నగరంలోని యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.