BHPL: మహదేవపూర్ మండలం సూరారం గ్రామంలో సూరం విజయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. సూరారం సర్పంచ్ మేకల శంకరమ్మ బ్యాట్ పట్టి టోర్నమెంట్‌ను ఆరంభించారు. విజేత జట్టుకు రూ. 20,000, రన్నరప్‌కు రూ. 10,000 నగదు బహుమతులు సూరం విజయ్ తండ్రి మహేశ్ అందజేస్తారు. గ్రామ యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు.