వనపర్తి: గద్వాల పట్టణంలోని భీమ్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్న బోయ పవిత్ర మంగళవారం అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. మల్దకల్ మండలం మద్దెలబండ గ్రామానికి చెందిన కుమ్మరి వినయ్- పవిత్ర రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరిదీ ఒకే గ్రామం కావడం, పలు కారణాలతో గద్వాలలో ఉంటున్నారు. ఈ క్రమంలో పవిత్ర మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది.