NZB: జిల్లా బోర్గాం 2వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆదివారం పరిశీలించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంబేడ్కర్ కమిటీ హాలు సందర్శించారు. ఈ కార్యక్రమంలో బోర్గాం కాంగ్రెస్ అధ్యక్షుడు రాజు, మట్ట రాము, నగేష్ తదితరులు పాల్గొన్నారు.