WGL: వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం రాత్రి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి పై నిఘా పెంచి 64 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. వారి పై కఠిన చర్యలు తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ విభాగంలో 40, సెంట్రల్ జోన్లో 16, వెస్ట్ జోన్లో 6, ఈస్ట్ జోన్లో 2 కేసులు నమోదయ్యాయి.