WGL: కట్రియాల గ్రామ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనకు గాను రవీందర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు గ్రామ పార్టీ అధ్యక్షుడు సతీష్ తెలిపారు. గత కొంతకాలంగా రవీందర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. పార్టీ నిబంధనలు అతిక్రమించినందున అధిష్టానం ఆదేశాల మేరకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.