BDK: వినాయకపురం దబ్బతోగు కాలనీలో నెల రోజుల క్రితం పంచాయతీ మోటర్ కాలిపోయిందని, నేటికీ మరమ్మతులు చేయకపోవడంతో నీటి సమస్య ఏర్పడిందని కాలనీవాసులు సోమవారం తెలిపారు. మిషన్ భగీరథ వాటర్ వస్తున్నా అవి మధ్యాహ్నం టైంలో వస్తున్నాయన్నారు. పూర్తిగా వ్యవసాయ పనులపై ఆధారపడి బతికే గ్రామంలో ఉదయం, సాయంత్రం తప్ప మధ్యాహ్నం సమయంలో ఎవరు అందుబాటులో ఉండరన్నారు.