మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి ఆయనకు నియామక పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు.