NLG: జిల్లాలో టైఫాయిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. రక్షిత మంచినీటి సరఫరాపై ఆరడబ్ల్యూఎస్ శాఖ, పరిశుభ్రతపై పంచాయతీరాజ్ శాఖలు నిరంతర చర్యలు తీసుకోవాలని సూచించారు.