HYD: మున్నూరుకాపు కార్పొరేషన్‌కు కమిటీలను నియమించి రూ.3 వేల కోట్లు నిధులను మంజూరు చేయాలని మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు డా. కొండ దేవయ్య పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జేవీఆర్ ఆదివారం మంత్రి కొండ సురేఖను మర్యాద పూర్వకంగా కలసి విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి బాల బాలికల హాస్టల్ భవన నిర్మాణానికి కేటాయించాలని కోరారు.