మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లాలోని రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగొళ్లపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో రైస్ మిల్లర్లు, మిల్లులను నిర్వహించాలన్నారు.