HNK: రాయపర్తి మండల కేంద్రంలో మాల మహానాడు నేతలు ఆదివారం ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఎస్సీ రిజర్వేషన్ను వ్యతిరేకిస్తూ ఈనెల 25 నుంచి మాలలు ప్రారంభించబోయే మహా పాదయాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు బొల్లం రామ్ కుమార్ మాట్లాడుతూ.. మనువాదుళ్లంతా ఏకమై అంబేద్కర్ ఆశలను కూని చేస్తున్నారని అన్నారు. దళితులను విభజించడం సరికాదన్నారు.