NRPT: మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని నోటికి వచ్చినట్లు మాట్లాడడం మాజీ ఎమ్మెల్యేకు తగదన్నారు. భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.