దేశవ్యాప్తంగా విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపుల కాల్స్ కలకలం రేపుతున్నాయి. ట్విట్టర్ నుంచి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. నిన్న ఒక్కరోజే 95 విమానాలకు హెచ్చరికలు వచ్చాయి. ఒకే సోషల్ మీడియా ఖాతా నుంచి మెయిల్స్ వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో నిందితుల వివరాలు ఇవ్వాలని ఎక్స్, మెటాలను కేంద్రం కోరింది.