TG: హైదరాబాద్లోని సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెటాలియన్ కానిస్టేబుళ్లతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ భర్తలకు పోలీస్ విధులు మాత్రమే అప్పగించాలని, ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కానిస్టేబుళ్ల భార్యలను అడ్డుకున్నారు. అలాగే, సెక్రటేరియట్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.