ATP: నార్పల మండల కేంద్రంలోని బాలికల పాఠశాల, జూనియర్ కళాశాల వద్ద శుక్రవారం పోలీసులు పహారా కాస్తున్నారు. ఇటీవల కాలంలో ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయన్న సమాచారంతో ఎస్ఐ సాగర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాల, కస్తూర్బా గాంధీ పాఠశాల, జూనియర్ కళాశాల ఆవరణములో పోలీస్ పహారాను ఏర్పాటు చేశారు.