AP: TDP కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ టడీపీ సభ్యత్వ నమోదు, నామినేటెడ్ పదువుల భర్తీపై నేతలతో చర్చించారు. దీంతో సీఎం సూచనల మేరకు ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో చేపట్టేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.100 సభ్యత్వంతో కార్యకర్తలకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం సాయం అందించనున్నారు.