సాధారణంగా గోంగూర చాలామందికి ఇష్టం ఉంటుంది. ఇది రుచితోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్ సీ, ఏ, బీ1, బీ2, బీ9 పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ కణాలను అదుపులో ఉంచుతుంది. ఎముకలను దృఢంగా చేస్తుంది. హైబీపీ, గుండెజబ్బులు, షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది. అలాగే, చర్మంతోపాటు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కాగా, గోంగూరను వారంలో కనీసం రెండు సార్లయినా తింటే ఆర్యోగానికి మంచిది.