తమిళ స్టార్ నటుడు సూర్య హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన చిత్రం ‘కంగువా’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ వ్యాఖ్యాతగా మారి.. సూర్యను ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.