TG: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకున్నాయి. బెటాలియన్ పోలీసులకు సెలవుల రద్దు నిర్ణయంపై గతంలో ఇచ్చిన ఆదేశాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించాయి. కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులతో చర్చలు జరపాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా, రెండు మూడు రోజులుగా బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. వారి ధర్నాకు ప్రభుత్వం దిగొచ్చి ఈ నిర్ణయం తీసుకున్నది.