TG: ఆంబోతును వదిలేసిన్నట్లు బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డిని వదిలేసిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వెల్లడించారు. పాడి ఒక సూసైడ్ స్టార్ అని పేర్కొన్నారు. మీడియాలో కనిపించడానికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. మహిళా అధికారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది మర్చిపోయావా అని ప్రశ్నించారు. సర్పంచ్ కుటుంబంలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 20 లక్షలు తీసుకొని ఉద్యోగం పెట్టించలేదు ఆ విషయం మర్చిపోయావా అని ఆరోపించారు.