TG: బిగ్బాస్ కంటెస్టెంట్ గంగవ్వ పంజరంలో చిలుకను బంధించారని ఓ వ్యక్తి ఫిర్యాదుతో గంగవ్వ, మై విలేజ్ షో బృందంపై ఫారెస్టు అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో మై విలేజ్ షో బృందం రూ.25 వేల ఫైన్ కట్టినట్లు DFO తెలిపారు. దీంతో కేసు క్లోజ్ అయ్యిందని పేర్కొన్నారు. కాగా, ఈ చట్టం తమకు తెలియదని మై విలేజ్ షో సభ్యుడు అనిల్ పేర్కొన్నారు. చిలుక జోస్యం వీడియోను తొలగించినట్లు తెలిపారు.