TG: ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఈడీ విచారణ ముగిసింది. సుదీర్ఘంగా తొమ్మిది గంటల పాటు అమోయ్ కుమార్ను అధికారులు విచారించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూములు బదిలీ వ్యవహరంలో విచారణ కొనసాగింది. కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని అప్పనంగా ఇతరులకు కేటాయించడంపై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరిగింది. రేపు కూడా ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.