AP: రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు కేటాయించడం సంతోషించదగిన విషయమని మంత్రి పార్థసారథి అన్నారు. భారత్ మాల కింద రూ.6 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణకు సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని వెల్లడించారు.