బీజేపీ నేత, అస్సాం సీఎం హిమంత బిస్వశర్మ మరోసారి కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ 20 శాతం టికెట్లను అమ్ముకుంటుందని ఆరోపించారు. మొత్తం 10 సీట్లు ఉంటే అందులో 20 శాతం టికెట్లను అమ్ముకుంటుందన్నారని, ఎన్నికల్లో ఈ డబ్బును వాడుకుంటోందని తెలిపారు. తానూ.. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడినేనని.. తనకు ఈ విషయం తెలుసన్నారు. కాగా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ముందు హిమంత చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.