TG: బీజేపీ ఆందోళనలతోనే హైడ్రా తోక ముడిచిందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు, బాధితులకు అండగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఈటల మాట్లాడుతూ.. అబద్ధాలకు మారుపేరు సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇక నుంచి ఒక్క ఇళ్లు కూల్చినా ఊరుకోమని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి తమతో కలిసి మూసీ ప్రాంత పరిశీలనకు రావాలని సవాల్ విసిరారు.