ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో అభిమానులకు టచ్‌లోనే ఉంటున్నాడు. అయితే, తాజాగా పెట్టిన పోస్టు ఫ్యాన్స్‌ను కలవర పెడుతుంది. ‘నాకు నిద్ర పట్టడం లేదు. ఎవరైనా సాయం చేయండి’ అంటూ ‘X’లో పంచుకున్నాడు. దీంతో ధావన్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ.. ‘నీకేం కాదు నువ్వో ఛాంపియన్వి ధైర్యంగా ఉండాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.