కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజన రుణ పరిమితిని పెంచింది. ఈ రుణాలను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ పథకంలో శిశు రుణాల కింద రూ.50 వేల వరకు, కిశోర రుణాలు రూ.50 వేల-రూ.5 లక్షల వరకు, తరుణ్ రుణాలు రూ.5-10 లక్షల మేర అందిస్తున్నారు. తాజాగా తరుణ్ ప్లస్ పేరిట రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.