MBNR: మత్స్యశాఖ అభివృద్ధికి కృషి చేస్తాం అని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు. మత్స్యకారులకు 100% సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గండీడ్ మండలంలోని సాలార్ నగర్ ప్రాజెక్టులో చేప పిల్లలను ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి, మండల నాయకులు విడుదల చేశారు.