ఉక్రెయిన్, పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. వీలైనంత త్వరగా వీటికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా ప్రాంతాల్లో శాంతిస్థాపన దిశగా కృషి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. యుద్ధాల వల్ల సమస్యలు పరిష్కారమవుతాయని భారత్ ఎప్పటికీ విశ్వసించదని పేర్కొన్నారు. మరోవైపు 20వ శతాబ్దంలో ఏర్పాటైన గ్లోబల్ ఫోరమ్లు 21 శతాబ్దపు సవాళ్లను పరిష్కరించడానికి సరిపోవని మోదీ అభిప్రాయపడ్డారు.