TG: దక్షిణ కొరియాలోని సియోల్ పర్యటనకు వెళ్లిన మంత్రుల బృందం ఇవాళ హైదరాబాద్‌కు చేరుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మంత్రులు పొంగులేటి, పొన్నం, మేయర్ విజయలక్ష్మీ, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య బృందానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాగా, వీరంతా సియోల్‌లోని చియంగ్ చూ నది, హాన్ నదుల అభివృద్దిని అధ్యయనం చేసేందుకు పర్యటించిన విషయం తెలిసిందే.