KDP: పొలతల, నిత్య పూజకోన, లంకమల్ల, మల్లెం కొండ, నాగేశ్వర కోన అరణ్యాలలో ఉన్న శివాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుట ప్రతి భక్తుని బాధ్యత అని జిల్లా దేవాదాయ శాఖ అధికారి మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. నవంబర్ 2 నుంచి కార్తీక మాసం ప్రారంభం కావడంతో శివయ్య దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారన్నారు. భక్తులు ఆలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.