TG: శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు విమానయాన అధికారులు తెలిపారు. ఇండిగో విమానంలో బాంబు పెట్టామని చెప్పినట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న ఆ విమానంలో 130 మంది ప్రయాణికులు ఉన్నట్లు పేర్కొన్నారు. బెదిరింపు కాల్ నేపథ్యంలో ప్రయాణికులను కిందకు దించి తనిఖీలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు.