TPT: ఎస్పీ వి.ఎన్.మణికంఠ చందోలు శుక్రవారం 18 మంది హోమ్ గార్డ్స్ పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్ చెక్కులను అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. హోమ్ గార్డ్స్ వంటి సిబ్బంది సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో, ప్రజలకు అండగా నిలవడంలో ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. పిల్లలకు విద్యకు ప్రోత్సాహం ఇవ్వడం వారి త్యాగానికి, సేవకు గౌరవం తెలియజేయడమేనని తెలిపారు.