బిహార్‌లోని సంజీవ్‌శర్మ ఓ స్వీట్‌షాప్ వ్యాపారికి మోదీ అంటే ఎంతో అభిమానం. దీంతో మోదీ మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు రాయల్ లడ్డూలకు ‘మోదీ లడ్డూ’ అని పేరు పెట్టాడు. ఈ లడ్డూలతో సంజీవ్ శర్మకు మంచి పేరు వచ్చింది. అయితే ఈ దీపావళికి మోదీ లడ్డూలను మరింత ప్రత్యేకంగా చేయాలనుకున్నారు. అందుకనే లడ్డూలలో పవిత్రమైన గంగాజలాన్ని కలుపుతున్నట్లు ఆ వ్యాపారి పేర్కొన్నారు.