AP: దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 29 నుంచి బుకింగ్ ప్రారంభం అవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ నెల 31 నుంచి మార్చి 31 వరకు మొదటి సిలిండర్ ఎప్పుడైనా తీసుకోవచ్చన్నారు. ఆధార్, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. సిలిండర్ అందించిన 48 గంటల్లోపు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని వెల్లడించారు.