TG: విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని మాజీమంత్రి KTR అన్నారు. ఈ అంశంపై సిరిసిల్లలో జరిగిన బహిరంగ చర్చలో పాల్గొని మాట్లాడారు. ‘తొమ్మిది ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నాం. అన్ని కంపెనీలను ఒకటే కేటగిరీగా మార్చాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం. ఇది హేతుబద్ధం కాదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలెక్కడ? ఛార్జీల పెంపుతో కుటీర పరిశ్రమలపై భారం పడుతుంది. అన్ని ఇండస్ట్రీలను కాపాడుకుంటేనే మనుగడ ఉంటుంది’ అని అన్నారు.