ATP: చౌడేపల్లి-పలమనేరు రహదారిలో శుక్రవారం ఉదయం పలమనేరు డిపోకి చెందిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. డీజిల్ లేక బస్సు ఆగినట్లు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. డ్రైవర్ డీజిల్ చెక్ చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. అనంతరం వారిని వేరొక బస్సులో అక్కడి నుంచి తరలించారు.