కృష్ణ: అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో వరాన్ని ప్రకటించింది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త రైల్వేలైన్ ఏర్పాటు కానుంది. కృష్ణా నదిపై 3.2 కి.మీ పొడవైన రైల్వే వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. ఖమ్మం, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో రైల్వేలైన్ నిర్మాణం సాగనుంది. కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ కొత్త రైల్వే లైన్ పూర్తి వివరాలను వెల్లడించారు.