VSP: జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామిని శుక్రవారం విశాఖ బీచ్ రోడ్డు నోవాటెల్‌లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను కూడా విశాఖలో కలిశారు.