న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. రెండో ఇన్నింగ్స్ ఆట ప్రారంభం నుంచే టీమిండియా తడబడింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే 6 వికెట్లను కోల్పోయింది. నిన్న రోహిత్ డకౌట్ గా వెనుదిరగగా.. ఈ రోజు శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, జైశ్వాల్, పంత్, సర్ఫరాజ్ ఖాన్, అశ్విన్ నిరాశపరిచారు. దీంతో 105 పరుగుల వద్ద 7 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం సుందర్, జడేజా క్రీజులో ఉన్నారు.