విజయవాడ సితార కుడలిలో శుక్రవారం ఉదయం లారీ దగ్ధమైంది. విజయవాడ నుంచి మచిలీపట్నం పోర్టుకు గ్రానైట్ రాయి లోడుతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడగా, స్థానికులు అక్కడ నుంచి పరుగులు తీశారు. లారీ నుంచి మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.