AP: అమరావతి రైల్వేలైన్కు కేంద్ర కేబినెట్ ఆమోదంపై ఎంపీ కేశినేని చిన్ని హర్షం వ్యక్తం చేశారు. రూ.2,245 కోట్లతో 57కి.మీ. కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం అంగీకారం తెలిపిందని అన్నారు. రాజధానికి కొత్త రైల్వేలైన్ నిర్మాణం రాష్ట్రానికి పెద్ద వరమని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కృషితోనే అమరావతి అభివృద్ధి సాధ్యమని ఎంపీ అన్నారు.