భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికారు. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. 14 ఏళ్లకే అరంగేట్రం చేసి ఎన్నో అరుదైన ఘనతలు సాధించిన రాణి రాంపాల్.. భారత మహిళల హకీకి మకుటం లేని మహారాణిగా ఎదిగారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు స్టార్ ఫార్వార్డ్ రాణి రాంపాల్.