బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ కుటుంబానికి డబ్బు ఆఫర్ చేయటంపై లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు రమేశ్ స్పందించారు. ‘సల్మాన్ ఖాన్ కుటుంబం మా మతపరమైన సెంటిమెంట్లతో ఆడుకుంటోంది. ఆయన చేసిన పనికి మా రక్తం మరుగుతోంది. సల్మాన్ ఇచ్చిన ఖాళీ చెక్కును మేం తిరస్కరించాం. బిష్ణోయ్ కమ్యూనిటీ మొత్తం లారెన్స్ బిష్ణోయ్‌కు అండగా ఉంటుంది. ధనవంతుడైన లారెన్స్ బిష్ణోయ్ డబ్బు కోసం సల్మాన్‌పై అటాక్ చేస్తాడా?’ అని ప్రశ్నించారు.