WGL: వరంగల్ నగరంలోని తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఆలయ అర్చకులు శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో చుట్టుపక్కల భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.