KMM: జూలూరుపాడు మండలం అనంతరం గ్రామానికి చెందిన సాలెపు ముత్తయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్య చికిత్సలకు పేద కుటుంబం కావడంతో ఎమ్మెల్యేను ఆశ్రయించారు. కాగా స్పందించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సీఎం సహాయ నిధి ద్వారా ఒక లక్ష 30 వేల ఎల్ఓసీ మంజూరు కాగా, ఆదివారం పత్రాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు.