BHPL: జిల్లా పరిధిలోని అన్ని పాఠశాలల్లో నేటి నుంచి ఈ నెల 28వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంచార్జ్ డీఈఓ రాజేందర్ తెలిపారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు ఈ పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. నవంబర్ 2వ తేదీ లోపు మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించి, ఆన్లైన్లో పొందుపరచాలని ఆయా ఉపాధ్యాయులకు తెలిపారు.