ADB: డీఎస్సీ 2008లో ఎంపికైన బీఎడ్ అభ్యర్థులకు ఆదిలాబాద్ విద్యాశాఖ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. అక్టోబర్ ఐదో తేదీ వరకు ఈ పరిశీలన కొనసాగుతుందని డీఈఓ ప్రణీత తెలిపారు. మొత్తం 135 మంది పేర్లను వారి హాల్టికెట్ నంబర్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. కాగా అభ్యర్థులు తమ సరైన ధ్రువపత్రాలతో పరిశీలనకు రావాలని ఆమె పేర్కొన్నారు.