WGL: దామెరలోని దామేశ్వర ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వివిధ రకాలైన పూలతో అలంకరణ చేశారు. అర్చకులు నాగిళ్ల రాజు శర్మ వేద మంత్రాల నడుమ అర్చనలు, అభిషేకాలు జరిపారు. శివం టెంపుల్ ట్రస్ట్ ఛైర్మన్ బిల్లా రమణారెడ్డి పర్యవేక్షణలో జరిగిన పూజల్లో భక్తులు అత్యధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని తమ కోరిన కోరికలు తీర్చాలని కోరుకున్నారు.